అలై పొంగెరా
అలై పొంగెరా
శీర్షిక; అలై పొంగెరా
*************************
పాటలా పల్లవించావు,మౌనమై
కడలి నురగులా కలసి పోయావు
ఉప్పెనైన మనసు విప్పి, చెప్పుకోలేని ప్రేమ
లేఖలెన్నో వ్రాసి ,రాసి పోశాను
గిరి దాటి రావా, పంతమేలరా మాధవ
అలుపేలేని మదికి ,ఆశ నీవైనావు.
నీ ముగ్ధ మనోహర మోహన రూపం,
నీలి మేఘ శోభిత సోయగం.
నీ అరవిరిసిన నయనతారకలు, వెన్నెల మంచు పొరలు కప్పిన కులుకులు.
అలై పొంగెరా కన్నా, నీపై ప్రేమఅలై పొంగేరా.
వేచే రాధ నీకై ధ్యాస,శ్వాస నీవై మాధవ .
*********************
రచన
కనక

