STORYMIRROR

KANAKA ✍️

Classics Fantasy

3  

KANAKA ✍️

Classics Fantasy

నింగిని చేరిన చినుకు

నింగిని చేరిన చినుకు

1 min
116

వెచ్చని సూర్యుడు సముద్రం మీద చేరి నాట్యం చేస్తుంటే.


ఆకాశం మీద నక్షత్రాలు హొయలు పోతుంది, నీ పిలుపు కోసం .


ఎదురు చూసే నా మనసు ఊయల విహారంలో తనివి తీరని తాపంలా.


నా గుండె మండువాలో వినబడుతుంది నీ పిలుపు .


చెక్కిలి మీద చిరునవ్వు చెరగనివ్వనని మాట

ఇచ్చావు నా కనుల సోయగంలో నిలిచావు.


ఎప్పుడు ఎక్కడో నేను పారేసుకున్న నా జ్ఞాపకాలని పోగుచేసి నా దరి చేర్చావు.


నీవు నాకు లేవు అనే తలంపే కనులు నీరు నింపుతుంది.

 

నీ వెచ్చని శ్వాస నా గుండె గవాక్షంలో నింగిని తాకే చినుకై,


నాగుండెలో ముత్యంలా మారుతుంది వెన్నెల కురిసే వెచ్చని కౌగిలి.


నీ రాక కోసం ఎదురు చూస్తూ రెండు కన్నుల కాంతిపుంజంలా మెరుస్తున్నాయి

దరిచేరగా రావా నింగిని చేరిన చినుకులా.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics