నాతో నువ్వు
నాతో నువ్వు
మౌనంతో ఒంటరి ప్రయాణం
నాతో నేను,
నాతో నువ్వు
వెలుగులు విరజిమ్మే నవ్వులుతో
బుడి బుడి పసి మనసులుతో
కవన కడలి కెరటాలుతో
కథల కౌగిళ్ళతో
సిరిమల్లె పువ్వు సింగరంతో
ముగ్ధమనోహర రూపంతో
మాధవుడ్ని ఆరాధించే రాధతో
రాస నృత్యం ఆడే తులసితో
కన్నయ్యా ఆరాధనా
స్నేహంతో , స్నేహం చేస్తూ
నా జీవితం మాధవార్పితం
రచన
కనక
