వెలుగుల దివ్వెలు
వెలుగుల దివ్వెలు
చెడుపై మంచి సాధించిన
విజయానికి ప్రతీక దీపావళి
కానీ ప్రస్తుతం నడుస్తున్న
చెడు పై మంచి ఎప్పటికి
విజయం సాధిస్తుందో వేచిచూద్దాం
పెరిగిపోతోంది..
నానాటికీ పెరిగిపోతోంది తప్ప
తరగడం లేదు.
ఆడబిడ్డల అలుపెరగని
ఆవేదన
రైతు సోదరుల తీరని
ఆక్రందన
పేద సాదలకి దరిచేరని
సంపాదన
నిరుద్యోగి కల నిజమయ్యే
సంఘటన
రేపటికై ఎదురుచూడని
నిరీక్షణ
ఇలాంటివి ఎన్నో నెరవేరిన నాడే
అసలైన దీపావళి..
ప్రతి దీపావళి చరిత్ర చెప్పే
జ్ఞాపకాలకు సాక్ష్యంగా
మంచి జరగాలని కోరుకుంటూ
చేసుకుంటాం.
కానీ పునరావృతం
అయ్యే మరుసటి దీపావళికి
అయినా చరిత్ర పుటల్లో
కొత్త చరితను లిఖించి
సరికొత్త జ్ఞాపకాలనూ
తెగించే పోరాట స్ఫూర్తినీ
మాట తప్పని ధీరత్వాన్ని
భావితరాలకు ఆదర్శంగా
అప్పచెప్దాం.
దీపావళి వెలుగులు చిందిద్దాం..
రచన
కనక
