నీకోసం ఆలోచిస్తూ కూర్చుంటే
నీకోసం ఆలోచిస్తూ కూర్చుంటే
కోసం
నీకోసం ఆలోచిస్తూ కూర్చుంటే,
పక్కగా వచ్చి ఫక్కున నవ్విపోయావు
అటు తిరిగి చూస్తే ,నువ్వు లేవు
నా ఊహలో నువ్వు నిరంతరం
నాతోనే ఉన్నావు...
నీకోసం ఆలోచిస్తూ కూర్చుంటే,
నా ఊహల్లో ఊపిరి అయి ఉన్నావు
సముద్రపు అలలు మాటున నిశ్శబ్దపు శంఖారావం హోరులా నిరంతరం నాలో సందడి చేస్తున్నావు
నాతోనే ఉన్నావు...
నీకోసం ఆలోచిస్తూ కూర్చుంటే,
నా మనసు నీ చెంతకే పరుగులు పెడుతుంది
నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని
ఉబలాటపడుతుంది పిచ్చి
మనసుకు తెలియదు నువ్వు
నాతోనే ఉన్నావు ..
నీకోసం ఆలోచిస్తూ కూర్చుంటే,
రెక్కలు కట్టుకొని వాలిపోయి
నీ ముందు నెమలిలా నాట్యం చేస్తూ,
హరివిల్లుల ముగ్గులు వేస్తూ
ఉన్న నన్ను చూసి నీలో ఆనందం పొంగుతుంటే
అప్పుడు అనిపిస్తుంది నువ్వు
నాతోనే ఉన్నావు...
నీకోసం ఆలోచిస్తూ కూర్చుంటే
యుగాలు నిమిషాల్లో గడిచిపోతున్నాయి
నిరంతరం నీ ధ్యాస, నీ ఆలోచనల సమాహారం వైజయంతి మాలల నా గుండెల మీద హత్తుకొని బరువెక్కుతూ తెలుపుతుంది నువ్వు
నాతోనే ఉన్నావు ...
రచన
కనక
