ఏలాలి
ఏలాలి
మానవత్వమె ఇంటగెలిచీ భువిని అంతా ఏలాలి
దానవత్వమె మంటగలిపీ భువిని విడిచీ తోలాలి
ఎన్ని నాళ్లని మతం ముసుగులొ మగ్గిపోతారెందుకో
సామరస్యమె మనిషిమదిలో నారుపోసీ నాటాలి
నీవునేనూ వేరువేరని వివాదాలూ ఎందుకో
సమానత్వమె ఇంటిముంగిట ముగ్గులేయని చాటాలి
ఉగ్రవాదాల్ మత్తులో తెగ ఊగిపోతారెందుకో
పెరటిలోనే శాంతిమొలకలు చివురులెత్తగ నాటాలి
కరుడుగట్టిన మనిషిమనసులు మార్పుకోరవు ఎందుకో
విశ్వశాంతియె కడకు విజయం ముష్కరులకే తెలపాలి

