కావాలోయ్
కావాలోయ్
కర్మధర్మ పరిరక్షణ..సూర్యసములె కావాలోయ్..!
శ్రమధర్మం సాక్షి కదులు..చక్రధరులె కావాలోయ్..!
మనుజులెల్ల కార్మికులే..ఎవరిపనికి వారె ప్రభువు..
సత్యమెరిగి పనిచేసే..వినయగుణులె కావాలోయ్..!
చెమటబొట్టు అసలు వెలను..గుర్తించే నాథులెవరొ..
ప్రగతిరథం నడిపించే..యజమానులె కావాలోయ్..!
బద్ధకాన్ని విస్మరించు..వివేకమే పెట్టుబడిరొ..
స్వయంశక్తి నమ్ముకున్న..పనిమంతులె కావాలోయ్..!
అంకితభావం మించిన..దైవీగుణ మేమిలేదు..
పనినే దైవముగ తలచు..భక్తిమతులె కావాలోయ్..!
నిజకార్మిక తత్వమనగ..అసలుసిసలు నాన్నతనం..
సరిహద్దులు కాపాడే..పార్థవరులె కావాలోయ్..!
