కసురుకున్న చీకటి
కసురుకున్న చీకటి
రేకులు విచ్చిన పువ్వు
రెక్కలు విప్పిన నవ్వు
"రే" చీకటిలో కలిసిపోయిన నువ్వు
మండుటెండలో కాలిన కాలు
మంచుకొండల్లో కూరుకున్న వాలు
మంచినీళ్ళకై రోడ్డున కట్టిన ధారలు
గుడిలో నైవేద్యపు నేతులు
గుడిపేరిట దళారుల చేతులు
గుడిసెలో చద్దికూడుకై కేకలు
సూరీడు వెలుతురులో
కసురుకున్న చీకటి
ముసుగేసుకున్న వారిదము
ఘనీభవించిన బేలతనము
నక్షత్రాల మిణుకులలో వెలుగు
గదిలోతుల్లో పూడుకున్న నాలుక
విషనాగుల వెంబడిలో కంబళి
కుహరం నుండి ఆక్రందనల వెలుతురు
కప్పుకుంది నలుదిక్కుల అవగతి.
ఇదీ ఈ తీరున మన జగతి..
© Radha
