మృత్యువు
మృత్యువు
మృత్యువు నానేస్తం
అవును నిజం
నన్నెప్పుడు మేల్కొనేలా చేస్తుంది
అప్పుడప్పుడు హెచ్చరిస్తూ
నా చుట్టూ ఏకాంతం
రాయడానికి అనుకూలముగా
నా రూమ్ సిద్ధం చేసుకున్నాను
నా అరుపు కూడా బయటకు వినపడని
నిశబ్ద వాతావరణం ఏపిలుపు వినపడదు
కవిత ఊరకలై పొంగింది
కాసేపటికి నిద్రముంచుకొచ్చింది
గాఢ నిద్రలో నన్నెవరో తట్టి లేపారు బహుశా (మృత్యువు ) నేస్తం అయి ఉండవచ్చు
కాళ్ళు చేతులు బిగుసుకుపోయి వున్నాయి
నరాల్లో సలపరం పుట్టుకోస్తుంది
ఎంత ఇదిల్చిన కదలడం లేదు నా శరీరం
గొంతు ఎంత గట్టిగా అరుస్తున్న
శబ్దం బయటకు రావడం లేదు
నేను ఒంటరితనాన్ని అవహించానో
ఒంటరితనం నన్ను అవహించిందో తెలియదు
అరుపు కూడా వినిపించుకోలేని ప్రదేశాన్ని
ఏర్పాటు చేసుకొనివున్నాను. ఒక్కసారిగా దుప్పటి విధిల్చి పైకి లేచాను... నో..... అంటూ అరుస్తూ
చేతులు కాళ్ళు బాగా నొప్పిగా వున్నాయి కాళ్ళు బలవంతంగా నేలపైనా మోపి వంటగది వైపు నడిచి గ్లాస్ వాటర్ తాగి కూర్చున్న
నిజానికి ప్రతీ వారం ఇది నాకు మాములే కలో నిజమో తెలియదు పడుకున్న 1 గంట తరువాత ఇలాగే మేల్కొంటాను ..బహుశా తానే నిద్ర లేపుతుందేమో (మృత్యువు ) తాను నానేస్తం కదా
నోట్...... ( సగం చావులన్నీ నేడు ఇవే అనుకోండి డబ్బులేక కాదు జబ్బులున్న కూడా మనుషులు మనసులకు దూరంగా ఉండటమే సమయానికి హాస్పిటల్ చేర్చేవారు లేక పెద్ద పెద్ద ఏసీ రూమ్ ల్లో ఏకాంతములో ఒంటరి చావులు )హార్ట్ ఎటాక్ లు
ఇప్పుడు కధలోకి వస్తే అసలు కద మొదలవుతుంది
నా ఫోన్ చెక్ చేసుకుంటాను ఎవరయినా అపరిచితుల కాంటాక్ట్స్ నా ఫోన్ లో ఉన్నాయా
నా కవితలకు బాడ్ కామెంట్స్ ఉన్నాయా చెక్ చేస్తాను ధైర్యవంతులు ఎవరయినా పెడుతుంటారు ప్రతీ రోజు క్రమం తప్పకుండా అభిమానంతో
పోచావు అనుకుంటా చూసి ఓ మాములు పలకరింపునేగా అనుకుంట
చెక్ చేస్తూనే వుంటా కొందరు మేడం కాఫీ కప్పుతో పాటు మీ కవితలు లేకుంటే రోజులాగా గడవదు అంటూ వుంటారు.... పొండ్రా బాబూ అనుకుంటూ నేనేదో నా మేల్కొల్పు కొరకు రాసుకుంటున్నఅని మనసులోనే అనుకుని.వదిలేస్తా... .అమ్మాయిలు అయితే నవ్వి వదిలేస్తాను
కొందరు మీ కవితలు దొంగిలించేసాము అంటూవుంటారు చిలిపిగా నవ్వుతూ వుంటారు వారిని....నా బిడ్డలు అనుకుంటాను
అంతకు మించిన ప్రశ్నలు ఏమికన పడవు ఎప్పుడూ నేను జవాబు ఇవ్వను కూడా
ఇక పోతే పర్సనల్ గా నా రోజు ఎలా గడిచిందో చెక్ చేసుకుంటా సహజంగా.. సమాజంలో ఎన్నో చూపులు నా వీపును తాకూతుంటాయి వారి పేర్లు కూడా తలవను తెలిసిన వారయినా తెలియని వారయినా.... నా వైపు నుండి ఎలాంటి తప్పు వారు చూపించే ఆస్కారం లేకుండా చూసుకుంటాను అస్సలు పట్టించు కోను
నా చూపు ముందుకే ఉంటుంది.. వెనక జరిగే వాటిని అస్సలు పట్టించుకోదు నానడక
ఇక పోతే నేను ఇంకా ఏమయినా బాధ్యతలు మిగుల్చుకున్నానా చేయవలసిన పనులు మిగిలి ఉన్నాయా అని ఆలోచిస్తూ వుంటాను.. ఏమిటో అండి పాడు జీవితం ఎన్ని చేసిన ఇంకా బాలన్స్ చూపిస్తుందే తప్ప పూర్తి అయినట్టు అనిపించవు
అప్పుడు మాట్లాడతాను ఏమిటో ఇందాక నువ్వు నన్ను తీసుకెళ్లి ఉంటే నేను కన్నా బిడ్డలకు న్యాయం ఎవరు చేస్తారు ఈ సారి రాపో అప్పటికి పూర్తిగా చేసేస్తా అంటూ వాయిదా అప్లికేషన్ మనస్సులోనే కోరుకుంటా
ఇక తెల్లవారాక ఆలోచిస్తాను ఏమిటో ఎన్నో రాతలు రాస్తున్న మంచితనం మానవత్వం అంటూ వీటితో ఉపయోగం లేదు సమాజంలో బ్రతకాలి అంటే నలుగురితో పోటీ పడాలిసిందే నీతులు చెప్పడానికి బాగుంటాయి మన బిడ్డలకు కూడు బెట్టవు కదా
వారిని ఇంకొంచెం మెరుగు పరచాలి మంచి దారి చూపించి ఫ్యామిలీతో వారు ఆనందంగా ఉంటే చూసి చచ్చి పోవాలి నాకింకేమివద్దు వారు బాగుంటే చూసి చచ్చిపోవాలి నాభర్తకు నేనెప్పుడూ నమ్మ్మకంగానే ఉండాలి నా విలువను నేను ఎప్పటికి పోగొట్టుకోకూడదు
పేదరాలిగా పుట్టానేమో కాని పేదరాలిగా జీవించలేను చావను లేను కదా అందుకే
ధనవంతురాలిగా చచ్చిపోవాలి..ఇది నా నిత్య పోరాటం
ఒరేయ్ పెద్దోడా ఓకవి గారు రాసినట్టు
నా సమాధి ప్రక్కన రాసుకోడానికి వీలుగా బ్లాక్ బోర్డు
చాక్ పీస్లు పెట్టించరోయ్
సరిపోవు ఏమో రా ఎందుకయినా మంచిది
రాయకుంటే ప్రశాంతంగా ఉండలేను నిద్రపోలేను ఈసమాధిలో పుస్తకం పెన్ను కూడా పెట్టించు
కొంచెం పూల మొక్కలు నాటించరా
ప్రకృతి అన్నా పువ్వులన్నా మహా ప్రీతీరా రెండు మొక్కలనన్నా నటించరా.. చూస్తూ పడుకుంటా
ఇంకొక్క మాట ఏసీ లేకున్నా నాకు పాలరాతి సమాధి కావాలి వేడిని తట్టుకోలేను చల్లగా వుంటాను
