దేవుని గోలా
దేవుని గోలా
" దేవుని గోలా " - రాజేష్ ఖన్నా
==========================
మనుషులు దొంగదేవుళ్లుగా మారి
మాయలుచేసి మనసుల్లోకి చేరి
మభ్యపెట్టి మనశ్శాంతిని కొల్లగొట్టి
మనుషుల్ని మట్టిబొమ్మలుగా చేసి
మట్టిబొమ్మల్ని దేవుళ్లుగా చేసి
దేవుళ్ళని దేధీప్యమానంగా కొలిచి
లోకానికి మహనీయులుగా నిలిచి
దేవుడి లీలలా గోల చేస్తున్నారు
అందని అంతస్తుల్ని సంపాదించడానికైనా
అసాధ్యమైనవాటిని సాధించడానికైనా
ప్రవచనాలు అద్భుతంగా పలికించడానికైనా
మెత్తని పూలపాన్పులపై పవళించడానికైనా
వీధుల్లో సాగే ఊరేగింపులో ఊరేగడానికైనా
అమాయకులచే జేజేలు అందుకోడానికైనా
రాజకీయాల్ని తన గుప్పిట్లో పెట్టుకోడానికైనా
కష్టంలేకుండా కడుపునింపుకోడానికైనా
దేవుడి గోలా మనిషి లీలగా కావాల్సిందే
చదువుకున్నోడు సంస్కారమున్నోడు
బాగా బలిసినోడు బక్కసిక్కిపోయినోడు
అందరూ దేవుడిగోలకి ఘోళ్ళుమంటారు
తమ శక్తియుక్తుల్ని, ధైర్యాన్ని నమ్ముకోకా
దొంగబాబాల చెంతచేరి గుడ్డినమ్మకాల్ని
నిగూఢరహస్యాల గుట్టుని తెలుసుకోలేకా
తెలివి తెల్లారేదాకా అన్నీ సమర్పించుకొంటారు
దేవుడికి అక్కరలేని డబ్బుని ఇచ్చుకొంటారు
మనిషికి అన్నీ దేవుడే చేసినప్పుడు
ఇష్టంలేని కష్టం చేయడమెందుకు
దైవమే లోకమంతటిని చూసినప్పుడు
లోకంలోని నేరస్తులకోసం అన్వేషనెందుకు
అంతుతేలనివాటికోసం ప్రయాసలెందుకు
అర్థంకానీ లక్ష్యాలవెనుకా పరుగులెందుకు
అంతటా దేవుడే ఉన్నాడని అది తామేనని
దేవుణ్ణి చేరే మార్గాలలో అసలైంది తమదేనని
దేవుడిబాబాలు మోసం చేసినా అది తీపే కదా
నిత్యం కొలిచినా సమస్యలు పారిపోవు
సర్గరోగానివారిణని చెప్పినా రోగాలుపోవు
ఒకచోటా సమస్యలు తీర్చిన దేవుడు
మరోచోటా సమస్యలు సృష్టించే దయ్యమా?
మనిషేందుకు దేవుడు ఉన్నదేవుళ్లు చాలనట్లు
మాయమైనా గాయాల్ని తట్టిలేపేటందుకా
మూఢనమ్మకాల్ని మూటగట్టి అమ్మేటందుకా
మనుషులు గొర్రలై గుర్రాల్లా పరుగులెడ్తున్నారు
దేవుడి లీలా ఈ గోలల్ని ఆపేదెప్పుడో మరి!
*****సమాప్తం****
