పేరడీ - భక్తి పాట - 2.4.21 కవీశ్వర్
పేరడీ - భక్తి పాట - 2.4.21 కవీశ్వర్
పేరడీ - భక్తి పాట
( కోడి ఒక కోనలో- పుంజు ఒక కోనలో: బాణీ )
పల్లవి:
స్వామి ఒక కొండలో- దేవి ఒక కోన లో
వెలిసినారు ముద్దుగా తిరుపతీ కొండపై
చరణం 1 :
కనులముందు దివ్యమైన రూపమందు గాంచితి
దేవి నైన భక్తివల్ల ఆలయంలో చూచితీ
వరమూ లీయరా ! మ్రొక్కులు తీర్చగా
తిరుమలవెంకటేశ స్మరణమునే చేయగా
" స్వామి ఒక కొండ లో "
చరణం 2 :
భక్తులంత మిమ్ము చేర పరుగులెత్తసాగిరి
కరుణతోడ వారివెల్ల పాపమ్ము ల బాపిరి
అభయమ్మీయరా ! మహిమా చూపరా
ఏడూ కొండల పై వెలసిన దైవమ్మే వీవురా
" స్వామి ఒక కొండలో "
కవీశ్వర్
కే జయంత్ కుమార్ . 2 . 4 . 2021
