డిసెంబర్ 10th
డిసెంబర్ 10th
మానవ హక్కుల దినోత్సవం!
నిశి రాతిరేల..
నిర్భయలఎందరో...
దిక్కులేక
దిక్కు కోసం ఎదురు చూచినట్లు
మానవ హక్కులకు ..
దిక్కే కారువాయే..నేడు!
పులి పంజా తిన్న..
జింక పిల్లకు జీవించే హక్కు లేనట్లు
పులిరంగు పులుముకున్న మానవుల
అహంకారపు హస్థాలలో..
జీవించే హక్కు ను ..
కోల్పోయిన వారెందరో!
ఓ మానవ హక్కుల దినోత్సవ మా!
నీ కోసం ప్రతిదినం ఓ రణం
తిరగబడితే బహుమతి.. మరణం!
అనామకులెందరికో..
నీ పేరు వినటమే ఓ గగనం!
ఇది దినోత్సవ మా ..
లేక.. దిన దిన గండమా!
దిక్కు మొక్కు లేని
ఓ మానవ హక్కా!
ఎవరి ఇంట్లో వేశావు ..నీ పక్క!
ఎప్పుడు చూస్తావమ్మా..మా పక్క!
..... రాజ్....
