మధ్య తరగతి మనుషులు
మధ్య తరగతి మనుషులు
కడుపు నిండని ఖాళీ బ్రతుకులు
ఎవరినీ యాచించడం చేతకాని జీవితం
ఆత్మాభిమానం గుండెలనిండా నింపుకున్నవారు
జీవిత గమనాన్ని కన్నీటి చాటున దాచుకున్న గుండెనిబ్బరం ఉన్న మనుషులు
మధ్యతరగతి చిరుమందహాసంతో రోజులు నెట్టుకొస్తున్న మధ్యతరగతి ధనికులు వారు
పేదలతో కలవలేరు, ధనికుల సరసన చేరలేరు
చేతిలో చిల్లిగవ్వలేకపోయినా, దైన్యాన్ని కళ్ళల్లో కనిపించనివ్వకుండా రోజులను నెట్టుకొస్తారు
ప్రభుత్వాలిచ్చే ఉచిత పథకాలకు అనర్హులు వారు
పలకరించి ఓదార్చేవారు ఉండనే ఉండరు
ఉన్నదాంతో సంతృప్తి పడి చిరునవ్వుతో చిల్లులు పడిన జేబుల్ని తడుముకుంటూ
సంతోషంగా బ్రతుకు బండిని గాడి తప్పకుండ ఈడ్చుకుంటూ జీవించే సగటు మధ్యతరగతి మనుషులు వారు.
