వాడిపోయిన జ్ఞాపకాలు..
వాడిపోయిన జ్ఞాపకాలు..
వాడిపోయిన జ్ఞాపకాలు..
మూసిన మది తలపులను తట్టి తెరుస్తున్నాయి.
మాసిపోయిన మధురానుభూతులను మరలించి చూడమంటున్నాయి.
వాడిపోయిన జ్ఞాపకాలు..
బలహీనమైన బంధాలను బలవంతంగా బందిస్తున్నాయి.
కరిగిపోయిన క్షణాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.
వాడిపోయిన జ్ఞాపకాలు..
పదే పదే పలకరించి పలవరిస్తున్నాయి.
గుండెల్లో గుబులుగా గుచ్చుకుంటున్నాయి.
వాడిపోయిన జ్ఞాపకాలు..
అనుభవించిన అనుభూతులన్నీ పొలమారుతున్నాయి.
తెగినవన్నీ తెరలు తెరలుగా తలచి తెస్తున్నాయి.
వాడిపోయిన జ్ఞాపకాలు..
చిత్రాలన్నీ చిందరవందరగా చిరిగిపోయాయి.
చివరకు చితిలో చేర్చమంటున్నాయి.
