రాలిన ఆకులు
రాలిన ఆకులు
ఈ వర్షం సాక్షిగా
రాలిన ఆకులు
వర్షపు జ్వాలలో
తడిసిపోయాయి.
రాలిన ఆకులు,
జ్వలించిన మనసు
తిరిగి
చిగురించవు.
రాలిన ఆకులు
రాళ్ళలో పడిన
నీటిలో పడిన
నేల రాలినవే.
వాటి ఆయుష్షు రాలిపోయింది అనే.
రాలిన ఆకులు చెపుతున్నాయి..
ఓ మనిషి రేపు నువ్వు కూడా ఇలాగే రాలిపోతావని...
