STORYMIRROR

Gangadhar Kollepara

Tragedy Others

4  

Gangadhar Kollepara

Tragedy Others

దగాపడ్డ జీవితం

దగాపడ్డ జీవితం

1 min
286

నమ్మినవారే కాలాగ్నులై విషాన్ని చిమ్మి చేశారు నిర్వీర్యం   

స్థైర్యం కోల్పోయిన స్థిత ప్రజ్ఞత్వం 

చింతలేని జీవితం అల్లాడింది చల పత్రమై  


మిట్టమధ్యాహ్నపు సూర్యునివలె మండుతోంది మది

కొట్టుమిట్టాడుతోంది ప్రాణం అలసిన ఆలోచనలతో 

లిఖితం కానీ విధిలిఖితం అయ్యింది శాపమై 


మనోల్లాస మహోజ్వల మకుటాధారీ మురారీ 

ముసలాన్ని మధించి మువ్వన్నెవిల్లుల 

మనుగడను ముంగిట ప్రసాదించ రావా ....


Rate this content
Log in

Similar telugu poem from Tragedy