STORYMIRROR

Gangadhar Kollepara

Others

4  

Gangadhar Kollepara

Others

అలసిన తనువు

అలసిన తనువు

1 min
317

మదిలో మధురమై మురిపాలు పంచావు 

ఆమనివై ఆనందాలు అందించావు

మౌనంగానే కలలను సాకారం చేసావు 


అంతలోనే అనుబంధాన్ని అంతం చేసావు 

దగ్గరగా ఉంటూనే దూరం చేసావు 

భారమై మాసిపోని గాయం చేసావు 


మనసునుంచి నిన్ను మాయం చేయలేక 

మరచిపోలేక తనువంతా నయనాలు చేసి 

నిరీక్షిస్తున్నా నీ ప్రేమ పలుకుకై ప్రియతమా...


Rate this content
Log in