STORYMIRROR

Gangadhar Kollepara

Others

4  

Gangadhar Kollepara

Others

వివాహ బంధం

వివాహ బంధం

1 min
295

నడుమ నిలచిన ధవళ వర్ణపు తెరను తీసా 

కనులు కనులు కలిసిని వేళ మది సంద్రం ఉప్పొంగె 

జీలకర్ర బెల్లంతో ఆలుమగలనయినాము 

మూడుముళ్ల బంధంతో అర్ధాంగివైనావు 

అగ్నిహోత్రుని సాక్షిగా హృదయ పీఠాన్ని అలంకరించావు  

ముత్యాల తలంబ్రాలతో సంబ్రమాల సందడి చేసావు 

చిటికిన వేలు హిడిదు ఏడడుగులు వేశావు 

అరుంధతినీ చూపిస్తూ వామ భాగాన్ని నీ కర్పించా

అర్ధనారీశ్వరివై కడవరకు నను విడువక నాలో నిలిచిపోవా...


Rate this content
Log in