శీర్షిక: నవీన విద్య
శీర్షిక: నవీన విద్య
అక్షరం అక్షరం బట్టి పట్టైనా
నాలుకతో నాట్యం చేయించేనా
బుర్రలో దూర్చేయాలి
నూటికి నూరు శాతం తెచ్చేయాలి
లేకుంటే నామోషి!
ఎదురింటి అమ్మాయి
పక్కింటి అబ్బాయిలా
పెద్ద చదువులు చదివేయాలి
గుజ్జులో గులకరాలు ఉన్న ఫికర్ లేదు!
కుదిరితే చదివి కుదరకుంటే పైసలు పెట్టి
పేరు పక్కన డిగ్రీ చేరుపోవాలి!
అప్పుడంటే క్లాసులో ఒక్కడికే మొదట ర్యాంకు
నూటికో కోటికో ఒక డాక్టరు, ఒక ఇంజనీర్
మరి ఇప్పుడు
కాసులతో కార్పొరేట్ క్లాసులు
ర్యాంకులు అటకెక్కి గ్రేడ్లు దిగుబడి
ప్రతి వాళ్ళు టాపర్లే!
ఎండమావి కోసం ఎగబడే బాటసారిలా
ఎంప్లాయ్మెంట్ నూసే గాని ఎంప్లాయిమెంట్ లేక
పనికి తగ్గ పైసలు రాక
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు
పరదేశానికి పయనం కట్టి
ఇక్కట్లలో కూరుకుపోతున్నారు!
చిన్న పని చేసుకోలేక
సొంత పని చేసుకోవడం రాక
చితికి పోతున్నారు!
వైట్ కలర్ వేసుకున్న నిర్రక్షరాక్షలుగా
మిగిలిపోతున్నారు !!
-జ్యోతి మువ్వల
