మగవాడు
మగవాడు
మగవాడు
పుట్టగానే పురుటిలో ఆడపిల్లని హతమార్చెేవాడు ఒకడు,
లోకం తెలియని పసిబిడ్డ జీవితాన్ని నాశనం చేసేవాడు మరొకడు.
ప్రేమించానని వెంట పడేవాడు ఒకడు,
అదే ప్రేమ దక్కకపొతే యాసిడ్ దాడి చేసేవాడు మరొకడు.
నమ్మించి మోసం చేసేవాడు ఒకడు,
కట్టుకున్న భార్యను కష్టపెట్టేవాడు మరొకడు.
కట్నం కోసం వెేదించేవాడు ఒకడు,
ఒంటరిగా వుంటే అవకాశం తీసుకునెేవాడు మరొకడు.
ఆడపిల్లని చులకనగా చూసేవాడు ఒకడు,
మనిషి జన్మనెత్తి మృగంలా ప్రవర్తిస్తాడు మరొకడు.
ఆడపిల్ల శక్తి ఎంతో చూపించు అతడికి,
స్త్రీ కన్నెర చెేస్తెే మరో జన్మ ఉండదని తెలియచెేయి అతడికి.
