ఓ ఆడపిల్ల జీవితం
ఓ ఆడపిల్ల జీవితం
అందమైన జీవితం
ఓ అమ్మాయి జీవితం
కొదువలెేదు ఆమె జీవితంలో సంతోషం
ఆమె కుటుంబమే తన ప్రపంచం
అనందంతో సాగుతుంది ఆమె పయనం
ఆ సంతోషాన్ని చూడలేక కన్నెర చేసె కాలం
అప్పుడే వచ్చింది ఆమెకి కష్టం
తన జీవితాన్ని మార్చడానికి మొదలు అయింది ఒక పరిచయం
ఆ పరిచయమే ఆమెకు మిగిల్చింది దుఃఖం
అదే ఆమె కన్నీటికి కారణం
దాని వలన ఆమె అనుభవించింది నరకం
కష్టం వస్తే కన్నీరు తుడిచెేందుకు రాలేదు ఏ హస్తం
ఆమెకు ఎక్కడా కనిపించలేదు నిజమైన నేస్తం
ఆమె గురించి మాట్లాడుకుని కొందరు చేశారు కాలక్షేపం
ఆమెను వుంచారు దూరం
ఆమెను చూసి జాలి పడింది దైవం
తిరిగి వచ్చింది ఆమెకు తన జీవితం
మళ్ళీ దగ్గర అయింది తన కుటుంబం
ఇక మొదలు అయింది ఆమె జీవితంలో సంతోషం
ఇకపై ఎవరిపైనా పెటుకోదు ఆమె నమ్మకం
మొదలు పెడుతుంది ఆమె ఒంటరి పోరాటం
జీవితంలో సాధిస్తుంది విజయం
