మిస్ యూ
మిస్ యూ
Miss you
మిస్ అవడం అనేది ఒక గొప్ప అనుభూతి...
ఒక స్నేహితుడిగా...
ఆత్మీయుడిగా...
ఇష్టమైన సఖుడిగా...భక్తుడిగా...
ఒక జన్మంతా...గుండె నిండా నిను మోస్తాను...
కొన ఊపిరి ఉన్నంతవరకు!!
***
కన్నీటి ధారతో నీకు అర్చన చేస్తాను..
జ్ఞాపకాల మాలతో నిను అలంకరిస్తాను..
అనురాగాల పూలతో అభిషేకిస్తాను..
విరహ తాపాన్ని హారతి ఇస్తాను..
వేదన నిండిన మనసుని కానుక చేస్తాను..
తలపులతో తపిస్తాను..
నువ్వులేని ఆత్మలో ఏకాకినై నీకై జపిస్తాను.
నీతోడులేని జీవితంలో నరకయాతన అనుభవిస్తాను..
నీ జంట చేరే నూరేళ్ళ పంట కోసం దారులకై సంచరిస్తాను..
నీ....మనసులో ఏదో ఒక మూల..
ఒక క్షణపు స్థానానికై..
నా కోసం నీ తలపునకై పరితపిస్తాను..
లోకాలకు తెలియని అనంతమైన ప్రేమను
నీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా కురిపిస్తాను!!
***
నా రుదిరపు చుక్కల తారవై..
నాలో ప్రవహించు జీవ ధారవై..
నా ఆశల పల్లకి మోసే నావవై..
నా అజ్ఞాత ప్రేమకు అర్హురాలివై
నా అనురాగానికై వేచి చూసే అశోక వనపు సీతవై..
నా ఆఖరి మజిలీవై..
నా తుది శ్వాసలోని నిండైన రూపమై..
నా మరణాన కూడా నను వదలని జ్ఞాపకమై..
నను వేధించి..వెంటాడు!! భరిస్తాను!!
***
కానీ మిస్...అయినందుకు
నను క్షమించు!! మైత్రికా!!
***
పశ్చాతాప హృదయంతో
కన్నీటి అభినందనలతో...
నీ ప్రేమ పొందలేని వీరాభిమాని!!
నీ అఙ్ఞాతపు ఆత్మవాసి!!
--
హరి
