ఆ రెండు కళ్లు
ఆ రెండు కళ్లు
ఆ రెండు కళ్ళే!!
ఆ రెండు కళ్ళే
ఆ రెండు కళ్ళే
నా వైపు
ఆర్తిగా చూస్తాయి..
నన్నెప్పుడూ
వెతుకుతాయి..
నన్నెప్పుడూ
వెంటాడుతూనే
ఉంటాయి..
నా ముందుకు
స్వర్గ సౌందర్యాలను
మోసుకువస్తూ ఉంటాయి..
నన్ను మత్తులో
ముంచేస్తూ ఉంటాయి..
నన్ను కైపులోకి
లాగేస్తూ ఉంటాయి..
నన్ను వేల మందిలో ఉన్నా
అనుసరిస్తూ ఉంటాయి..
నన్ను ఒక సైగతో శాసిస్తాయి..
నా మనసులోని మాటను
చదుతుంటాయి..
నా హృదయ స్పందనను
అనుసరిస్తాయి..
నావేదనను
పరిశీలిస్థాయి..
నా పరిస్థితిని
పరిశోధన చేస్తాయి..
నా అనురాగాన్ని
తమ లోగిల్లలోకి అనుమతిస్తాయి..
నా విరహాన్ని
తమ కౌగిళ్లతో బంధిస్తాయి..
నా దిశను
తమవైపు మారుస్తాయి..
నా గమనాన్ని
బలంగా నిర్దేశిస్తాయి..
ఆ రెండు కళ్లే..
నాకోసం రోదిస్తాయి..
నాకోసం వెలుగునిస్తాయి..
నాకోసం ఎదురు చూస్తాయి..
నాకోసం నిట్టూర్చుతాయి..
నాకోసం పరితపిస్తాయి..
నాపై తమ నిరంతర ప్రేమవర్షానికి
సాక్ష్యాలుగా నిలుస్థాయి..
నను మనిషిగా గుర్తిస్తాయి..
ఆ కళ్ళకు మనసా స్మరామి..!!
ప్రేమపూర్వక శిరసా నమామి!!
--
హరి మొజ్జాడ
