STORYMIRROR

HARIHARARAO MOJJADA

Romance

4  

HARIHARARAO MOJJADA

Romance

యాంత్రిక జీవనంలో ఒక రోజు

యాంత్రిక జీవనంలో ఒక రోజు

2 mins
212

యాంత్రిక జీవనంలో ఒక రోజు

ఓ కనుపాప తెరమీద కనువిందైన రూపమా..

అరవిరిసిన ప్రియ మందారమా..

కవ్విస్తావు..నవ్విస్తావు..

వేలు పట్టి నడిపిస్తావు..

స్నేహంగా పుట్టి ప్రేమతో పెనవేసి బంధంతో అల్లుకున్నావు..

వేకువ వాకిట్లో ముగ్గుల ముచ్చట తీరాక

వేడి వేడి కాఫీతో వంటింటి నుంచి పరుపింటికి పరువపు వానను తెస్తావు..

ఆ జల్లులతో నను తడిపి తబ్బిబ్బి చేస్తావు..

యాంత్రిక జీవితపు వెసులుబాటుతనం పగలంతా నిను తాకనివ్వదు..

విసిరి.. వేసారి..వేగంగా..ఆయాస ప్రయాసలతో సాయంత్రానికి నీ చేరువలోకి..!!

వేడెక్కిన విరహంతో వంటిట్లో నీవు..

అలకతో కూడిన నీ మనసును కాకా పట్టేందుకు

నా కోరికల,ఆశల పల్లకిని నిను చూపించేందుకు మూరెడు మల్లెపూలు.. వేడి వేడి పకోడీ..ఇక ఏముంది..

ఆంతరిక ఆనంద వీధుల్లో ఆత్మీయ విహారాలు,కబుర్లు,కానుకలు,చన్నీటి స్నానం..వంటిట్లో రుసరుసలు..మునగచారు..పప్పన్నం..నాలుక పండేందుకు చిలుకలు చుట్టే మిఠాయి..ఆకు వక్కలపొడి.. అవిశ్రాంత చిరాకు పరాకుల నుండి ప్రేమ,మమతల అంతరాళంలోకి..

 గుండె చప్పుళ్ళ కోరికలను విన్నవించుకునే ఏకాంతంలోకి...

వెన్నెల పిండార బోసినట్లుండే పౌర్ణమి రాత్రిన తెల్లని పట్టు చీర..మల్లెపూలు..పాల గ్లాసు..పాపిట సింధూరం..పైకప్పు లేని పడకగది..నులక మంచం..గుసగుసలు..గిల్లికజ్జాలు..చందమామను ఊరిస్తూ నీ అందాలను నేను ఆరగిస్తూ,ఆవిరి చేస్తుంటే ..ఈ జీవిత ప్రమాణం ఒక శతాబ్దం పెరిగినంత ఆనందం..

ఇలాంటి యాంత్రిక జీవితపు గమనంలో నీతో ఒక్క రోజైనా అలా గడిపే భాగ్యం దొరికేనా??

ఒక్క రోజు కాదు..

ఒక జీవిత కాలమంతా కావాలి.

ఆ జీవితం నీ ప్రేమతో పరవశించి

ఆద్యాంతం సంతోషంతో పులకించాలి.. వేచి వేచి మనం వేసే ప్రతీ అడుగూ అలాంటి జీవితాన్ని ఆస్వాదించడానికే అని ఆశగా నమ్ముతూ..

నీ మన్మోహన మన్మథుడు

ముగ్ధ మనోహర ప్రేమికుడు.!!

--

మీ హరి

 ఒక రోజు

Rate this content
Log in

Similar telugu poem from Romance