STORYMIRROR

HARIHARARAO MOJJADA

Inspirational

4  

HARIHARARAO MOJJADA

Inspirational

నాన్న నేర్పిన అడుగులు

నాన్న నేర్పిన అడుగులు

1 min
363

నాన్న నేర్పిన అడుగులు👣👣


నాన్న నేర్పిన అడుగులు

పది నెలల వయసులో ఆయన భుజాల పైన

ఛాతీ మీద నడిపించిన తప్పటడుగులు..

రెండేళ్ల వయసులో ఆయన చిటికెన వ్రేలు పట్టుకుని నడిచిన బుడి బుడి అడుగులు..

అయిదేళ్ల వయసులో ఆయన స్పర్శ లేనిదే నిద్ర పట్టని రాత్రులు..

పదేళ్ల వయసులో ఆయన బెత్తానికి దొరకకుండా పెట్టిన పరుగులు..

పది పాసయ్యాక పదిమందిలో నడిచిన నడవడిక..

పై చదువులకు పై ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన రాకకై వేచి చూస్తూ ఎదురెళ్లి హత్తుకున్న పరుగులు..

***

పొలం గట్లపై నడక..చెరువులో ఈత..

సైకిల్ తొక్కడం..చెట్లు ఎక్కడం..

ఆవు మేపడం..దూడ విప్పడం..

అరక కట్టడం..దుక్కి దున్నడం.. 

గిడుగు బల్ల..నారుమడి..

పార పట్టడం..ఎరువు చల్లడం..

గొనపం పోటు.. కత్తి వేటు..

యాతం నీరు.. బాగారి తీరు..

జడివాన జోరు..పరుగుల హుషారు..

మెరుపుల తళుకు..పిడుగుల బరువు..

***

చదువులు... విలువలు..

కుటుంబం బలాబలాలు..

మంచి చెడుల తేడాలు..

మమకారపు మాధుర్యాలు..

ఆత్మ గౌరవాలు.. ఆత్మాభిమానాలు..

ఆస్తులు..అంతస్తులు.. మనుషుల మనసులు..

నాన్న కి తెలియని ప్రపంచమా??!

***

నాన్న ఒక నడిచే పుస్తకం..నాన్న కదిలే కావ్యం..

నాన్న మన సైన్యం..నాన్న మన ధైర్యం..

నాన్న మన బలం..నాన్న మన బంధం..

నాన్న మన గౌరవం.. నాన్న మన నమ్మకం..

నాన్న మన సంస్కృతి..నాన్న మన ఉన్నతి..

***

విలువల్ని ఆస్తిగా 

చదువులను బ్రతుకు తెరువుగా 

వరప్రసాదించు దైవం..నాన్న

విశ్వాన్ని నడిపించు విశ్వాసం నాన్న

విస్వమెరిగిన విజేత నాన్న...

నాన్న నేర్పిన అడుగులు...

అవి అడుగులు కాదు..ఆయుధాలు..

జీవిత పోరును గెలిచేందుకు ఉపకరించు బ్రహ్మాస్త్రాలు...

నాన్నకు వందనం 

పాదాభివందనం 🙏🙏


Rate this content
Log in

Similar telugu poem from Inspirational