నమోనమః
నమోనమః
శిరసుమీంచి జారుతున్న..అక్షతలకు నమోనమః..!
ఈ జన్మకు వరమయ్యిన..తన ప్రేమకు నమోనమః..!
ప్రియమారగ మోసి కనీ..సంతసాన సాకినదే..
అప్పగింత చేయ..తడబడిన అమ్మకు నమోనమః..!
తండ్రిగుండె చెమ్మవిలువ..తెలియలేని బ్రతుకెందుకు..
నా ఇష్టము పండించిన..నా నాన్నకు నమోనమః..!
రుణముతీరు సంగతేమొ..తోచకనే వందనాలు..
నను మనిషిగ మలచిరే..ఆ పెద్దలకు నమోనమః..!
చదువులేమి చదివానో..విజ్ఞతెంత పొందానో..
అభినందన జల్లులైన నేస్తాలకు నమోనమః..!
నా ఊపిరి ఊయల కద..
అక్షరాల వేణువులో..రాగాలకు నమోనమః..!
