ప్రతిభెంతో
ప్రతిభెంతో
అవార్డులో డాక్టరేట్లొ..ఇచ్చువారి ప్రతిభెంతో..!
చాటుగాను అడ్డంపడి..పట్టువారి ప్రతిభెంతో..!
కాకాలతొ బాకాలతొ..తారలెవరు అవుతారో..
ఎట్లాగో సాధించగ..దూకువారి ప్రతిభెంతో..!
చాకచక్య మవసరమే..ఒక ఉన్నతి పొందేందుకు..
మేధను తెలిసీ చక్కగ..తొక్కువారి ప్రతిభెంతో..!
బేరాలను కుదుర్చుకొను..తెలివికదా తెలివంటే..
నకిలీనే అసలీగా..నమ్మువారి ప్రతిభెంతో..!
నాటకమీ జీవితమను..ఎఱుకలేని సంగతియే..
అధిగమించు కాంక్షతోటి..ఎగురువారి ప్రతిభెంతో..!
తిట్టాలను ఎంచాలను..బుద్ధి నిజం పాడుబుద్ధి..
నేర్చుకునే సంగతినే..మరచువారి ప్రతిభెంతో..!
