STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తెలుసుకో

తెలుసుకో

1 min
0



ప్రతి వెలుగు వెనుక కనబడని చీకటి దాగుంది.
ఆ విజయం వెనుక చెప్పలేనంతా గా కష్టం దాగుంది.
ఆ పెదాల నవ్వు వెనుక దాగున్నా బాధ ఎంతో.
చెదిరిన జీవితంలో చెప్పలేని అట్లు పోట్లు ఎన్నో.
నడిచే ప్రయాణం లో ముళ్ళ దారులెన్నో.

ప్రాణం పోసుకున్నా ఆ శిల్పం వెనుక 
తగిలిన ఉలి దెబ్బలెన్నో.
ఆ మౌనం వెనుక దాగిన మాటలెన్నో దాగున్నాయి.
జేబులో దాగున్నా ఆ పచ్చ నోటు వెనుక 
దాగిన కష్టం ఎంతో.

ఉరిమే మేఘం వెనుక బీభత్సం సృష్టించే తుపాను దాగుంది.
అలసిన మనసులో అలజడులెన్నో.
పెను ప్రమాదం సృష్టించే వర్షపు చినుకులు.
గర్భంలో దాగున్నా బిడ్డ కోసం 
తల్లి పడే ఆరాటమెంతో.
వచ్చే పుట్టుక వెనుక చావు దాగుంది.
రాసిన అక్షరాల వెనుక దాగున్నా అర్థాలెన్నో.
ఓ అర్థం వెనుక పరమార్థం దాగుంది తెలుసుకుంటే.

                  


Rate this content
Log in

Similar telugu poem from Classics