వసంత మాసం (prompt 23)
వసంత మాసం (prompt 23)
ప్రకృతి అందమైన పచ్చ పచ్చని చీర కట్టింది
లేలేత చివుళ్ళతో చెట్లను అలంకరించింది
లేత మొగ్గలను ఆకులు మాటున దాచింది
వసంతకాంత తుషార హారములు ధరించింది
మొగ్గలు పూవులై రంగులను విరజిమ్మాయి
పూవులు, సీతాకోకచిలుకలను ఆకర్షించాయి
తుమ్మెదలు మధువును గ్రోలి మత్తెక్కాయి
వనాలు వర్ణమయమై అందరినీ అలరించాయి