STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆమెకలలు

ఆమెకలలు

1 min
0


చూపాలని తలచలేను..చిత్రమైన ఆమెకలలు..! 
చెలిమివీణ తంత్రులింట..చినుకులైన ఆమెకలలు..!  

నాకోసం పరితపించు..జవరాలిని కలవలేదు.. 
తను నింపెను లేఖలలో..వరదలైన ఆమెకలలు..! 

కనులముందు ఎగసిపడే సంద్రాలవి..ఎంతలెమ్ము.. 
పలుక వీలుపడని తీపి..మెఱుపులైన ఆమెకలలు..! 

పెదవివిప్పి చెప్పలేదు..బొమ్మగీసి చూపలేదు.. 
తనసబలత చాటేందుకు..నిప్పులైన ఆమెకలలు..! 

తలపులలో పరిపక్వత..కలిగేనట మౌనంలో.. 
కావ్యగంగ పొంగువేళ..వాగులైన ఆమెకలలు..! 

గెలవలేని అక్షరాలు..ఇగిరిపోవు వేడుకలో.. 
శ్వాససాక్షి సంతకాల..పూవులైన ఆమెకలలు..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics