నటన
నటన
మంచి అనే ముసుగు కప్పుకున్నారు.
తియ్యని మాటలు ఒలకబోస్తున్నారు.
ప్రేమాభిమానాలు పంచుతున్నారు.
పైకి నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు.
నమ్మకంగా ఉన్నట్లు నటిస్తారు గొప్పగా.
ఎవరికి అనుమానం రాకుండా ఉంటారు.
లోపల ఇంకో మనిషి ఉన్నట్లు ఎవరికి తెలియదు.
లోలోపల ఎంతో నటన దాచుకుంటారు.
మనం కూడ నమ్ముతాం గుడ్డిగా.
మన అనుకుంటాం మనవ్వాళ్ళుగా చూస్తాం.
అసలు సమయం వచ్చే సారికి వాళ్ళ
ముసుగు తీస్తారు.
అవకాశం కోసం చూస్తారు నమ్మకాన్ని వమ్ము చేస్తారు.
జీవితంలో కోలుకొని దెబ్బ కొడతారు.
చావు వరకు ఎవర్ని నమ్మకుండా చేసి
అందగా నటిస్తారు గొప్పగా.
