STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నాన్న

నాన్న

1 min
0



నాన్న వెంటనడచిన ఆరోజులే బాగున్నాయ్
అమ్మ మూపు చేరిన ఆరోజులే బాగున్నాయ్
.
మినరలు వాటరు లేనిదే ముద్దైన దిగదిప్పుడు
చెలమనీళ్లు తాగిన ఆరోజులే బాగున్నాయ్
.
పిజ్జాలు బర్గర్ల పార్లర్లే ఎటు చూసినా
దిబ్బరొట్టె మరిగిన ఆరోజులే బాగున్నాయ్

తందూరి బిర్యానీలుంటేనే డిన్నరిపుడు
ఆవకాయతొ తిన్న ఆరోజులే బాగున్నాయ్
.
క్రూజుల్లో విమానాల్లో విహారాలు ఇప్పుడు
ఎడ్ల బండి ఎక్కిన ఆరోజులే బాగున్నాయి
.
వేనవేల ఛానళ్లలొ టి.వీ ప్రొగ్రాములిపుడు
చిత్రలహరి చూసిన ఆరోజులే బాగున్నాయ్
.
ఒక ఇంట్లో ఎందరున్న ఎవరికి వారే ఇపుడు
కొట్టుకున్న కలిసిన ఆరోజులే బాగున్నాయ్


Rate this content
Log in

Similar telugu poem from Classics