నా పల్లె అందం
నా పల్లె అందం


భోగిమంటల వెలుగు
పిండి వంటల రుచులు
హరిదాసు కీర్తనలు
బసవన్న ఆటపాటలు
కోడి పందాల సరదాలు
గాలి పటాల హరివిల్లు
రంగవల్లుల రంగుల వాకిళ్ళు
ధాన్యపు రాశుల లోగిళ్ళు
అద్భుతాల చిరునామా
ఆనందాల నిలయము
కనుల విందు మా పల్లె అందాలు!!
ఊసుల కందని మా పల్లె గొప్పతనాలు!!