కొంచెం సిగ్గుండాలి
కొంచెం సిగ్గుండాలి
నియమాలు పాటించాలని చెబుతూ
నీరసంగా మాట్లాడ్డం ఎందుకు
మైమరపించే కథల మాటున
పొంచి ఉన్న ఆపద దాచి
నన్నిలా ఊబిలోకి లాగడం ఎందుకు
కొంచెం సిగ్గుండాలి
ప్రేమ పేరుతో పంచాయితీలు చేసి
నలుగురిలో కలిసి తిరిగి
ఈరోజు ఇష్టం లేదని చెప్పడానికి
అంత నిలకడ లేనప్పుడు
పెళ్లి దాకా రావడం ఎందుకు
సినిమా చివర్లో త్యాగం చేయడానికి రెడీ అయినట్లు
ఎప్పుడూ ఓ విచిత్ర పరిస్థితిని స్ఫూర్తిగా తీసుకోవడం ఎందుకు
ఏం
నువ్వు తినే తిండి నీక
ు తెలీదా
కట్టే బట్టల గురించి తెలీదా
అన్నీ తెలిసినప్పుడు
దేశమంతా తిరిగినప్పుడు
కాస్త ఇంగిత జ్ఞానం లేదా
నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పి
నీ దారిన నువ్వు పోతావా
నా గురించి అంత ఆలోచిస్తే
నువ్వు మొదట్నుంచీ దూరంగా ఉండాల్సింది
ప్రేమనేది నలుగురికీ చూపించే భ్రాంతి కాదు
నలుగురిలో గౌరవాన్ని ఇచ్చే అనుభూతి
అది ఉద్యోగం హోదాలానో
పచ్చ నోట్లతో వచ్చే మత్తులానో ఉండదు
నచ్చి తీసుకునే బాధ్యత అది
వదలలేని జ్ఞాపకాల ఊరట అది