STORYMIRROR

Midhun babu

Drama Classics Others

4  

Midhun babu

Drama Classics Others

కలల పుట్టుక

కలల పుట్టుక

1 min
2

కళ్ళు ముందు కనిపించని దృశ్యాలు కలలు

మనసు తెరపై మాయాజాల ప్రదర్శన

ఊహాజనితాలు కాదు వాస్తవాలు

పుట్టుక, గిట్టుక గురించి

ఏ కలల పంచాంగం చెప్పదు

కలల ఫలితాలు చెప్పేవన్నీ కాదు వాస్తవాలు


పగటి కలలు మన చేతుల్లో ఉన్నవే

దగ్గరకు తీస్తే చాచికొట్టే సముద్ర అలలు

మనిషిని మనలోకంలోంచి 

వాటి లోకంలోకి విహరింపజేయడంలో దిట్టలు

కొన్నిసార్లు ఊబిలో పడేసి కుంగదీయొచ్చు

ఆకాశంలో చుక్కల పక్కన చేరుస్తే సంబురం

అటు ఇటు కాకుండా నడుమంత్రాన పడేస్తే

నీళ్లను గిల కొట్టినట్లుంటది ఫలితం


కలల జీవన జాతకచక్రం

చెప్పగల దిట్టలు లేరనొచ్చు

కలలు కొన్ని జీవితాంతం వెంటాడుతుంటాయి

మరుపుల సందుకలో దూరేవే అధికం

జేబులో కొత్త నోటులా కనిపించే కలలు

కొన్నాళ్లకు మాసిపోతాయి, చిరిగి పోతాయి


ఆశల కొర్రాయి వాతలు పెడ్తుంటే

ఆలోచనలు తేనెటీగలు ముసురుకుంటాయి

ఆవేదనల పుండ్లు సలుపుతాయి

బాధల రోట్లో దంచినట్లు

రాత్రి నిద్రను కల్లోల పరుస్తాయి

దినచర్యను ఇబ్బందుల పాలు చేస్తాయి


కొన్ని కలల పుట్టుకలు ఆనందమయం

అనుకున్నట్టు జరిగితే అద్భుతమే

బొక్కబోర్లా పడేస్తే

ఆచరణ ప్రశ్నకు జవాబు దొరకదు

కంచర్ల గోపన్నల జీవితాన్ని మార్చింది కలలే


కలలు కనడం తప్పు కాదు

కలల పుట్టుక ఎవరి చేతిలో లేదు

కలల ఫలం కోసం కావాలి సాధనాశూరులం



Rate this content
Log in

Similar telugu poem from Drama