పరకాయ ప్రవేశం
పరకాయ ప్రవేశం
అరవై ఏళ్ల వయసులో బాల్యంలోకి మరోసారి..
పరకాయ ప్రవేశం చేయాలనే కల సాకారం..
కావాలని మనసులో పదేపదే చేజారిన తలపుగా..
బోసి నవ్వుల బుజ్జాయిలా
తల్లిదండ్రుల ప్రేమకు అపురూపంలా..
రేపటి ఆశల వారధినై
కలల భవితకి బాటసారిలా..
రాబోయే తరానికి వారసత్వపు
మానవజాతి ఆణిముత్యంలా..
అమాయకపు ఆరిందాల ఆటల
అల్లరి పిడుగులా..
స్వచ్చమైన గలగలా పారే గోదారి సవ్వడిలా..
కాలుష్యం అంటని నిర్మలమైన
మలయ మారుతంలా..
కల్మషం ఎరుగని గగనాన మెరిసిన
మేలిమి తారకలా..
జలతారు వెన్నెల జాలువారే పసితనపు జాబిల్లిలా..
కొలనులో విరిసిన లేలేత అందాల
కలువ పువ్వులా..
నందన వనంలో పురి విప్పి ఆడే
నాగ మల్లికలా..
మనోహరమైన రంగు రెక్కలతో స్వేచ్ఛగా తిరిగే సీతాకోకచిలుకలా..
ప్రేమను పంచుకునే
చిలకా గోరింకల ప్రతిరూపంలా.. పదిమందికి గుర్తుండే జ్ఞాపకంలా మిగలాలనే
