STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

రాజ్యం

రాజ్యం

1 min
220

గెలుపొందిన సంపద మూటలు

దాసీల ఆర్తనాదాలు

అతిశయం గొలిపే మృత దేహాలు

వాటి నుండి ప్రవహించే రక్తపు వాగులు


సంపద నశించింది

దాసీలు మరణించారు

మృత దేహాలు భూమిలో కలిశాయి

రక్తపు చారల మీద

సంబరాలతో కొత్త ముగ్గులు కనిపించాయి

రాజు తరలి వస్తున్నాడు


రాజ కుటుంబంలోని వారంతా వస్తున్నారు

ఉన్నట్టుండి ఏదో అలజడి

రాజు కళ్లకు చుట్టూ రక్తమే కనిపించింది

బానిసల తొడల నుంచి చిట్లి

మొహం మీద నుంచి పెల్లుబికి

మోకాలి గాయాలను సలుపుతూ

అవే రక్తపు చారలు


ఓ చిన్న పిల్ల ముగ్గు వేస్తోంది

ఆ ముగ్గుల గీతలు

ధర్మాన్ని ప్రశ్నించే రాతలు

రథం మీద నుంచి దూకి పారిపోవాలనిపించింది 

రాజుకు శ్వాస కష్టమైంది


రాచ పీనగ ఒకటే పోకూడదనేమో

ఆ రథం

ముగ్గు వేసే పిల్లను కూడా చక్రాల కింద నలిపేసింది

ఆయువు తీరినా

రక్త కాంక్ష తీరని రాజుకు

మరో రక్తపు చారిక అంటుకుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract