నవతరం
నవతరం
పాశ్చాత్య పోకడల మధ్య
పెద్దా,చిన్నా బేదాలు మరచి
చిరిగిన దుస్తులు వేసుకుని
సంప్రదాయానికి నీళ్లు వదలి
నీచ సంస్కృతిని నెత్తిన వేసుకుని
కుళ్ళు ను, కుతంత్రాలను నేర్చుకుని
బెట్టింగుల మాయలో పడి
జీవితాన్ని ఆశ్వాదించడమే పనిగా పెట్టుకుని
ఎదుటి వాడిని ఎలా ముంచాలో తెలుసుకుని
కర్తవ్యాన్ని మరచి
అమ్మా నాన్న ల ఆప్యాయతలని వదలుకుని
జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఓ నవతరమా...
మిమ్ము మార్చుట... మా తరమా...
నవతరం అంటే...
వివేకానందుడి ఆశలో మొలచిన విల్లు...
మరి నేటి తరం ఎక్కడ కి పోతుంది...
అద:పాతాళానికి దారిని వెతుక్కుంటూ
అసురపర్వానికి శ్రీకారం చూడుతూ...
వారికి వెన్నెముకగా నిలుస్తూ...
నవతరం అంటేనే...చీదరింపు తెచ్చేలా... వేషాలు వేస్తూ...
నేటి మేటి యువతరం...
మరచార నాటితరం... వారి త్యాగఫలితమే స్వాతంత్ర్యం అని...
మీసం మొలవకముందే ఆంగ్లేయుల తుపాకి గుండ్లకి బలైనవారు...
వయస్సు తో సంబంధం లేకుండా...
నేటి కొంతమంది సాధించిన పేరు ప్రఖ్యాతలు కనపడట్లేదా?
వారిని చూస్తూ... మారిపోకండి
మారిపోతే ఎలా?...నీలో మార్పు వస్తుంది
ఇంటిలో మార్పు వస్తుంది, ఊరిలో మార్పు వస్తుంది...
అందుకే... మారు... రేపటి తరానికి దారి చూపే నావికుడిలా... నాయకుడిలా...
అప్పుడే దేశ ప్రగతికి వెన్నెముకలా మారుతావు... మార్పు తెస్తావు ...
