STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కాలంలో ప్రయాణం

కాలంలో ప్రయాణం

1 min
43

ఇంకా నమ్మకముందా

వెనక్కి వెళ్ళే యోచన ఉందా

కాలంలో ప్రయాణించి

ఇంకా ఏం సాధించాలి


మరింత అందమా

ఆయుష్షు పెంచాలా

అవినీతికి ముసుగు వేయాలా

అందలమెక్కి మొక్కించుకోవాలా


ఇంకా నీకర్థం కాలేదా

వేళ్ళ మధ్య నుంచి ఇసుక జారినట్టు

గుప్పిట బిగించినా

సమయం చేజారిపోతోంది


చూపుల్లో అంతరం తెలిసిపోతోంది

నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే

కాలం అర్థమవుతుంది

నీ ప్రవర్తన మారితే చాలు

కాలంలో ప్రయాణం కన్నా

వర్తమానాన్ని హాయిగా గడపడమే

జీవిత సాఫల్యం అని తెలుస్తుంది


మొండి పట్టు మార్చుకుని

కాస్త ఆలోచించు

జుట్టు ఊడకుండా కూడా

జ్ఞానం సిద్ధిస్తుందేమో..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract