STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నిన్ను తీసుకురావాలని

నిన్ను తీసుకురావాలని

1 min
5

అదేదో సినిమాలోలా

అన్నీ గుర్తుండి 

నిన్ను మాత్రమే మర్చిపోయానేమో

అదే చోటికి మళ్లీ వెళ్ళేసరికి

పాత జ్ఞాపకాలు గాయాన్ని తాజా చేసాయి


మార్కెట్ రోడ్లో

కూరగాయలు కొంటూ

దొంగ చూపులు చూసే నువ్వు

అక్కడే నిలబడి నీకోసం ఎదురు చూసే నేను


ఇప్పుడు మార్కెట్ రోడ్డు మారిపోయింది

చెట్ల దారి కాస్తా చెదిరిపోయింది

మంచు కరుగుతున్నట్లు 

నాలో అహం పోయింది

నిన్ను మళ్లీ ఇక్కడకు తీసుకురావాలని

ఎంత ఆశపడ్డానో

చిత్రంగా అనిపించేది

నువ్వూ నేనూ ఒకటే అని

అంత బుద్ధి లేకుండా ఎలా ఆలోచించాను అని


ఎవరి మనసైనా

ఈ హిల్ స్టేషన్ లాగా పర్యాటక ప్రదేశం కాదు కదా

ఇష్టం వచ్చినప్పుడు వచ్చి

ఋతువు మారగానే వెళ్ళిపోవడానికి

ఏదో దారి వెతుకుతూ వెళ్లి

మన పాత ఇంటిని చూసాను

ఎవరో రంగులు వేయించారు

ఆ రంగులు నీ అబద్ధాలలా ఉన్నాయి


మనం తిరిగిన పడవ

ఎప్పుడో విరిగిపోయింది

ఎవరికీ అక్కర్లేదని చెత్తలో వేసారు

నీ రబ్బరు బ్యాండ్లు

మేకప్ డబ్బా ఒకటి నా దగ్గరే దాచా

ఇవాళ వాటిని లోయలో పడేసాను

ఇక నేనూ రాను

నిన్ను తీసుకురాను..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract