కొత్త కొత్తగా మరో వింతగా..
కొత్త కొత్తగా మరో వింతగా..
మరోసారి ప్రేమలో పడ్డట్టు
మధురమైన బాధ వైపు
ఇంకోసారి పయనం
ఇంత కన్నా గొప్పగా
ఏదో ఉందని వెతుకుతూ
అంతే గొప్ప ప్రేమని
మళ్లీ మళ్లీ కనుగొన్నా
ఊట బావిలో నీటిలా
గాయం చేసే కొద్దీ నాలో ప్రేమ
విశ్వజనీనమైన ప్రేమ
నాలోనే కనుగొన్నా
ఎన్నో ఏళ్ళు వర్షం పడిన తర్వాత
గోడల మూల పట్టి
ఎప్పటికీ పోని పాచిలా
నా మనసు పొరలకు
నీ పేరు అంటుకుంది
అది కరగదని అనుకున్నా
మరోసారి వర్షం అంటే భయపడ్డా
ఇప్పుడలా కాదు
తడిచే కొద్దీ ప్రేమలో
తవ్వినన్ని పేర్లు ఎన్నో
అందులో నీ పేరు
ఎప్పటికీ కొత్తదే
కాస్త స్పెషల్
అంతే
అంత మాత్రాన మిగతా వాళ్ళు తక్కువని
ప్రేమకు అంతమని కాదు
