సౌదామిని..!
సౌదామిని..!
సౌదామిని..!
తీవల వంపుల ఒదిగిన
తీయని సొగసుల జననం..
ప్రకృతి పొత్తిళ్ళలో ఎదిగే
ముద్దులొలుకు కుసుమం..
రంగు రంగుల పూరేకుల కనువిందు
ఆహ్లదమిచ్చే సుమాల విందు
మనోహర పరిమళ భరితమందు
అలంకరణలో నీవే ముందు...
వాలు జడన వయ్యారంగా ఒదిగి
మగని కళ్ళను తన వైపు తిప్పుకొని
సుమగంధాల వెదజల్లి కవ్విస్తూ
కలల సౌధాలు నిర్మించిన కనుల సౌదామిని..
భగవంతుని శిరసును చేరే వరం
పూజకు నీవే ప్రధాన కైంకర్యం
కుసుమమా..
వెన్నెల దారను పంచే సుమమా
హరివిల్లును భువికి తెచ్చిన శమంతకమా..!
రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)
మంగానెల్లూరు,తిరుపతి జిల్లా.
8331844527
