ఏమైందో..!
ఏమైందో..!
1 min
364
కదలని బొమ్మలకు ఎంతో విలువ..
ప్రాణమున్న మనిషికది లేకపోయె..
మోసగాళ్ళకు సన్మానాలు
మంచివారికి మంచినీళ్ళే మిగిలే..
రాక్షసులపై నమ్మకాలు
కరుణామయులపై అపనిందలు...
కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం
కింద పడ్డాక ఎదుటి వారిపై నెట్టేయడం..
కలికాలాన మాయాజాలమేమో
ఆ ముసుగులో సాగుతున్న భావజాలమేమో..
తెలియక చేస్తే పొరపాట్లు
తెలిసి చేస్తుంటే తప్పవు గ్రహపాట్లు..
ప్రకృతి మాత రొమ్ము గుద్దుతూ
తమ ప్రాణాలను పణంగా పెట్టేస్తున్నారు...
ఏమైందో..?ఈ లోకానికి..!
చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)
