పుస్తకమా నువ్వేక్కడ
పుస్తకమా నువ్వేక్కడ
పాఠశాలలో ఉపాధ్యాయుల కరములలో ఉండి
విద్యార్థుల సంచుల్లో ఉంటూ
జ్ఞానాన్ని అందించే నువ్వు
రాను రాను అందని దూరంగా వెళ్లేలా చేస్తూ
పుస్తకము కంటే పూట గడవడం ముఖ్యం అనేలా చేసిన
ఈ ఆధునిక చరవాని యుగంలో పుస్తకమా నువ్వెక్కడ
చిట్టి కథలు పేజీలు ఎక్కడ
చూసి మురిసే బొమ్మల పుటలు ఎక్కడ
చూసి రాసేందుకు వచ్చిన అక్షరాలు ఎక్కడ
పోరు గాదలెక్కడ
స్టేజీ నాటకాలు ఎక్కడ
చరవాని చెరసాలలో బందీ అయిన మనుషుల మధ్యలో పుస్తకమా నువ్వెక్కడ
చించిన పేజీలకు తిన్న దెబ్బలెక్కడ
వికాసాన్ని అందించే విసృత ప్రపంచమెక్కడ
పుస్తక పఠనంతో మునిగి గడిచిన క్షణాలెక్కడ
దాచుకున్న డైరీలు ఎక్కడ
పుస్తక పఠనంలో తెలుసుకున్న బంధాలు బాధ్యతలు ఎక్కడ
చరవాని వ్యాధి అంటుకున్న క్షణంలో పుస్తకమా నువ్వెక్కడ....!!!
