STORYMIRROR

Midhun babu

Abstract Romance Others

4  

Midhun babu

Abstract Romance Others

జన్మ దాతలు

జన్మ దాతలు

1 min
332


ప్రేమ జననం తెలియని 

ప్రేమ విలువ గ్రహించని 

ఆధునిక ఆవేశపు యువతా!


మనము ప్రేమించే వారికన్నా

మనల్ని ప్రేమించే వారికి

ఎక్కువ రుణపడి ఉండాలి

వారే మన జన్మదాతలు 

అమ్మా నాన్నలు!


గట్టు తొవ్వి తట్టల్లో మట్టి మోసి

కలుపు తీసి చెలో నాటు వేసి

తినో తినకో అర్దాకలితో పూట గడిపి!


మన అక్షర జ్ఞానం కోసం

తమ శ్రమనే పెట్టుబడిగా

హుందా వస్త్రాలు సరస్వతి పుస్తకాలకు

కర్చు చేసిన ఈ లోకం దేవుళ్ళు 

కన్నవారే!


రెక్కలొచ్చాయని విహంగాలు ఐపోతే ఎలా

గమ్యం తెలియని ఆ ప్రయాణం

చిట్టడవిలోకి చేర్చేస్తుంది!


వేలు పడ్డి వివేకం జీవితం నేర్పినవారి 

మలి ప్రాయంలో తోడు నీడగా ఉంటేనే

మన జన్మకి అర్దం పరమార్ధం,!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract