,మధరసంసారము
,మధరసంసారము
తనువు సత్యము శివము సుందరము..!
మనసు సరసరాగ భవసాగరము..!
ఇది సరిగమల మధుర సం'సారము..!
హృదయమే నిత్యనూతన మందిరము..!
క్రొత్తదనము మనకు ధనము..!
' ప్రేమ' దివ్యమహా జీవనదము..!
చెలిమి గాక లేదు గగనము..!
ఈ'క్షణమే ఆనంద నందనము..!
చెరగని చిరునవ్వే వరము..!
ఈ జీవితమే కలల ఫలము..!
ఎందుకోయీ ఒంటరితనము..!
అందమైనది నిజ ఏకాంతము..!
అహంకారమే తోడైన ఆభరణము..!
భావమే భాగ్యమైన ఉద్యానవనము..!
శూన్యమే అమృతశక్తి నిధానము..!
ఇదే అసలుసిసలు సామ్రాజ్యము..!
