STORYMIRROR

Midhun babu

Abstract Inspirational Others

4  

Midhun babu

Abstract Inspirational Others

జీవమ్ము

జీవమ్ము

1 min
6

పంచధార యగును పాపముల్ తుడిచేయ..

పావనాంబ యైన పాలధార..

అమ్మరో చినుకన..ఆ ఈశ్వర వరము..

మనసు పెట్టి వినుము మాధవోక్తి..!


రంగు రుచులు లేని రంగైన చినుకురో..

రమ్యముగను నిండి రసములూర..

తనదు ధర్మమెఱిగి తపము సల్పెడు జాణ..

మనసు పెట్టి వినుము మాధవోక్తి..!


పూల ఎదలయందు పులకింతలను రేపు

పుణ్యశీల చినుకు ముచ్చటగను!

వేరువేరు నోట వేదాంత సుధయౌచు..!

మనసు పెట్టి వినుము మాధవోక్తి..!


ఇసక రేణువందు ఎన్ని లోకములోయి..!

వలపులెన్నొ దాచె వాగులోన..!

వరదలోన చేరి వజ్రరాజ మగునె..!

మనసు పెట్టి వినుము మాధవోక్తి..!


నీటిచుక్క లేక నిలువదే జీవమ్ము..!

కంటిచుక్కమాటు కడలులెన్నొ..

జన్మకథల గుట్టు చక్కంగ దాచెనే..!

మనసు పెట్టి వినుము మాధవోక్తి..!


Rate this content
Log in

Similar telugu poem from Abstract