నటనమాడవే
నటనమాడవే
ధినక ధినక తద్ధిమికల తాళంగా
దిక్కు ధిక్కారమే దేదీప్యమవ్వగా
ఛణ ఛణ చాటువులే చలించగా
చెణుకు బెణుకు చక్కెర చుక్కగా
కణ కణ కంకణ కవ్వమే చిలకగా
కనురెప్పలే ఆల్చిప్పలై విరియగా
నీలాల నింగి నిసి రూప మెత్తగా
నడకల నాట్యమే నటరాజవ్వగా
హరి హరుల అనుగ్రహ మవ్వగా
హరిణి తరంగిణి భరణి కృత్తికగా
కడలి అలలే ఝిల్లు ఝిల్లు మన
కాలి అందియ ఘల్లు ఘల్లు మన
సప్తస్వరాల స్వరఝరుల తోడుగా
సప్తాశ్వరుడే కొమ్ము సుర లూదగా.... ఆ.. ఆ..ఆ
ఆడవే మయూరీ... నటన మాడవే మయూరీ
ఆసంద్య సంతులలో శృంగార శిఖల సింగారమై
ఆపటమటి పొన్నల పంక్తులలో ప్రియ ఝరివై
ఆనంద తాండవ తూలికల తోరణమై.. ఆడవే..!!
