దోస్తులు
దోస్తులు
అరె దోస్తులు
మీరే నా ఎమ్మటి లేకుంటే
ఏడేళ్లు కాష్టపు పాన్పు మీద పరుసుకొని
ఈ కాయాన్ని ఎప్పుడో మట్టి దుప్పటి కప్పేసేది
మీరే లేకుంటే గీ అచ్చరాలు
నాతో కై గట్టి సాయిత జేస్తుండేనా
మీ మాటల పండుగే లేకుంటే
గాడి దప్పిన నా చీకటి బతుకున పొద్దెట్టా పొడ్సేదిరా
నా బీడువడ్డ మదినిండా
అక్షర గింజలు నాటింది మీరే కదరా
నన్ను వెలేసిన కాడల్లా
సోపతి తీగై నన్ను అల్లుకొని
బతుకు బంధపు పువ్వులై పూత్తిరి
మీరే లేకుంటే నా బతుకు
నీరు లేని యేరైతుండే
తొవ్వ లేని ఊరైతుండే
గియ్యాల గీ అక్షరాల బాటెమ్మటి
ఆరని అక్షర తటినై పారుతున్నానంటే
అది మీరు ఎమ్మటుండి అందించిన ధైర్యమేరా!.....
హరాక్షర 3074@
