STORYMIRROR

harish thati

Classics Inspirational Others

4  

harish thati

Classics Inspirational Others

రక్షా బంధన్

రక్షా బంధన్

1 min
6

సీస మాలిక:


శ్రావణ మాసాన చెల్లెలే వచ్చెను


రాఖీ పున్నంబుయె రయము గాను


అమ్మ నామ మొదటి అక్షరంబవగనె


నాన్నలోని సగము నాకు ద్విత్వము జేరి


అన్నగా మారెను అక్షరములు


ఆపదలే రాగ అండగ నిలువగ


ధైర్యము నింపెను తండ్రి తానై


అన్నయ్య అనగాను యప్యాయత చూపి


మమతని పంచెను మధురముగను


చివరి క్షణమునను చెంతనే నిలిచియు


రక్షణ ఇచ్చును రక్షయై తను


తే.గీ.


రక్ష పండుగ దినమున రాఖీ కట్టె


చెల్లి సోదరినికెపుడు తల్లి గాను


కలిమిలేముల వేళను కలిసి వుండి


ప్రేమను పంచు గొప్పగా ప్రీతి తోన



   @హరాక్షర 3074✍️


Rate this content
Log in

Similar telugu poem from Classics